![]() |
![]() |

బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క అన్నట్లుగా బిగ్ బాస్ సీజన్-8 (Biggboss 8 Telugu)సాగుతుంది. పన్నెండో వారం యష్మీ ఎలిమినేషన్ అయిన విషయం తెలిసిందే.. ఇక పదమూడో వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారో తెలియాలంటే మరో వారం చూడాల్సిందే.
తాజాగా బిగ్ బాస్ ప్రోమో వదిలాడు. పదమూడవ వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగిందని ఈ ప్రోమో ద్వారా తెలుస్తోంది. ఇంకా ఫినాలేకి మూడు వారాలు మాత్రమే ఉండడంతో ఈ వారం ఎవరిని నామినేట్ చేస్తారనేది కీలకంగా మారింది.
నామినేషన్ ప్రక్రియ భిన్నంగా సాగింది. ఎవరైతే నామినేట్ చేస్తారో వారికి రంగు పడుతుంది. మొదటగా గౌతమ్ ని నబీల్ నామినేషన్ చేశాడు. లాస్ట్ వీక్ లో కంటెండర్ షిప్ అప్పుడు వీళ్ళందరూ గ్రూప్ గా గేమ్ ఆడుతున్నారు.. వైల్డ్ కార్డు అందరిని పంపించాలనుకున్నారని అన్నావ్ ఆ పాయింట్ నాకు నచ్చలేదని చెప్పి గౌతమ్ ని నామినేట్ చేశాడు నబీల్. ఇక ఇద్దరి మధ్య హెటెడ్ అర్గుమెంట్స్ జరిగాయని తెలుస్తోంది.
ఆ తర్వాత అవినాష్ ని పృథ్వీ నామినేట్ చేస్తూ.. విష్ణు, మరో అమ్మాయి గొడవ పడుతుంటే మీరు మధ్యలో నాకెందుకని వచ్చారు.. అది కరెక్ట్ కాదని పృథ్వీ అనగానే అది వాళ్ళ పర్సనల్ విషయం. అలా పర్సనల్ విషయాల్లో నేను కలుగుజేసుకోనని అవినాష్ అన్నాడు. ఇక ఇద్దరి మధ్య గొడవ ముదిరింది. నువ్వు ఎలిమినేట్ అయితే నబీల్ ఏవిక్షన్ షీల్డ్ యూజ్ చేసాడని పృథ్వీ అనగానే.. నేనేం యూజ్ చెయ్యమని అనలేదని అవినాష్ అన్నాడు. ఇక వీరి మధ్య కూడా హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయని తెలుస్తోంది. ఇక పదమూడో వారం నబీల్, రోహిణి ఇద్దరు తప్ప అందరు నామినేషన్ లో ఉన్నారని ప్రోమోని బట్టి తెలుస్తోంది.
![]() |
![]() |